వ్యక్తిగత కండిషన్లు

వ్యక్తిగత కండిషన్లు
Keerti suresh : Individual Conditions

కీర్తి సురేష్ దక్షిణాది సహా దేశవ్యాప్తంగా ఎంతగా ఫేమస్ అయిందో తెలిసిందే. ఆ ఒక్క విజయం అమ్మడికి ప్రత్యేకమైన  గుర్తింపును తీసుకొచ్చింది. దీంతో కీర్తి కొన్నేళ్ల పాటు టాలీవుడ్ ని ఏలడం ఖాయమనే భావించారు. కానీ అలా జరగలేదు. అనుకున్నదొక్కటి అయినదొక్కటి! మహానటి సినిమా టైమ్ లోనే కొన్ని తమిళ్ సినిమాలు కమిట్ అవ్వడం..అదే సమయంలో కారణం లేకుండానే తెలుగులో వచ్చిన అవకాశాలను వదులుకుందని ప్రచారం సాగింది. మహానటిగా తనకు కలిసొచ్చిన ఇమేజ్ ను ఎందుకు వాడుకోలేపోయింది?  ప్రణాళికా లోపమా? అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
కీర్తి స్క్రిప్ట్ చెప్పడానికి వెళ్లిన ఏ దర్శకుడు విషయంలోనైనా  ముందు తన పాత్ర..తెరపై  కనిపించడానికి ఎంతసేపు ఆస్కారం ఉంటుంది? ఆ పాత్ర ఎంత వరకూ భవిష్యత్ కు న్యాయం చేయగల్గుతుంది?  సినిమా బడ్జెట్ ఎంత?  అంటూ ఆరాలు తీస్తుందిట. వీటితో పాటు దర్శకనిర్మాతలకు తన వ్యక్తిగత కండిషన్లు చెబుతోందట.  గ్లామర్ షో విషయం పక్కన బెడితే అవకాశాలు కోల్పోవడంలో అసలు పాత్ర పోషించేవి ఈ రీజన్సే అని కొందరు అంటున్నారు. అవన్నీ పట్టించుకోకుండా ఎంపిక చేసుకుంటే.. సెట్స్ కు వెళ్లిన  తర్వాత అమ్మడితో ఇంకెన్ని ఇబ్బందుల ఎదురవుతాయోనని సందేహం వ్యక్తం చేస్తున్నారట. 

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/