కోవిడ్ వైద్యాన్ని ‘ఆరోగ్యశ్రీ ‘లో చేర్చాలి : ఇందిరా శోభన్‌

కరోనా విషయంలో ప్రభుత్వం బాధ్యతారాహిత్యం అంటూ విమర్శ

Indira Shoban
Indira Shoban

Hyderabad: రాష్ట్రంలో కరోనా వైద్యాన్ని ‘ఆరోగ్యశ్రీ’లో చేర్చాలని వైఎస్ షర్మిల అనుచరురాలు ఇందిరా శోభన్‌ డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ఏపీలో కరోనా, బ్లాక్ ఫంగస్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఎందుకు టెస్టులు చేయించుకున్నారని ప్రశ్నించారు. కరోనా విషయంలో ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. . ప్రైవేట్‌ ఆస్పత్రుల దోపిడీని అరికట్టకుండా ప్రజలకు ఉచిత సలహాలు ఇస్తోందని దుయ్యబట్టారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/business/