ఇండిగో భారీ సేల్‌

రూ. 899కే విమానం టికెట్

IndiGo
IndiGo

న్యూఢిల్లీ:అందుబాటు ధరల్లో విమాన టికెట్లను అమ్ముతూ చౌక ధరల విమానయాన సంస్థగా గుర్తింపు పొందిన ఇండిగో, ‘ది బిగ్ ఫ్యాట్ ఇండిగో సేల్’ పేరిట దేశీయ రూట్లలో రూ. 899కే టికెట్లను అందించాలని నిర్ణయించింది. 26వ తేదీ రాత్రి 11.59 నిమిషాల వరకూ టికెట్ సేల్ అందుబాటులో ఉంటుందని, వచ్చే సంవత్సరం జనవరి 15 నుంచి ఏప్రిల్ 15 వరకూ ప్రయాణ తేదీని నిర్ణయించుకోవచ్చని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. విదేశీ ప్రయాణ ప్రారంభ టికెట్ ధరను రూ. 2,999కే అందిస్తున్నామని, ఇండిగో వెబ్ సైట్, యాప్ ల ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/