ఇండిగో కీలక నిర్ణయం..కడప నుండి విజయవాడ చెన్నైవిమాన సర్వీసులు

న్యూఢిల్లీ : ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో ఇండిగో ఒప్పందం కుదుర్చుకుంది. కడప నుంచి విజయవాడ, చెన్నైకు విమాన సర్వీసులు నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకొచ్చింది. ఈ మార్గాల్లో విమానాలు నడిపిన ట్రూజెట్‌ సంస్థ తాము సర్వీసులు నడపలేమని ఒప్పందం రద్దు చేసుకోవడంతో ఇండిగోకు అధికారులు అవకాశం కల్పించారు. తాజా ఒప్పందం దృష్ట్యా వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) కింద ఏపీ ప్రభుత్వం ఇండిగో సంస్థకు రూ.20 కోట్లు చెల్లించనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ‌తంలోనే కర్నూలు నుంచి విజయవాడకు మార్చి 27 నుంచి విమాన సర్వీసును నడుపుతామని గతంలోనే ఇండిగో సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా మార్చి 27 నుంచి వారానికి నాలుగు విమానాలను ఇండిగో సంస్థ చెన్నై-కడప, విజయవాడ-కడప మార్గాల్లో నడపనుంది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/