ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం!

indigo flight
indigo flight


పనాజి: గోవా నుండి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. 180 మంది ప్రయాణికులతో పాటు ఆ విమానంలో గోవా పర్యావరణ మంత్రి, వారి అధికార బృందం కూడా ఉన్నారు. విమానం ఎడమవైపు ఇంజన్‌ ఫెయిల్‌ అయింది. అది గమనించిన పైలట్‌ విమానాన్ని జాగ్రత్తగా కిందికి దించాడు. విమానం బయలేదేరేందుకు గాల్లోకి ఎగిరిన 20 నిమిషాల్లోనే ఎడమవైపు ఇంజన్‌లో మంటలు లేచాయి. అది చూసి ప్రయాణికులు భయంతో పెద్దగా కేకలు పెట్టారు. పరిస్థితి గమనించిన పైలట్‌ విమానాన్ని సురక్షితంగా దించాడు. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని మంత్రి కోబ్రాల్‌ అన్నారు. అందరిని మరో విమానంలోకి ఎక్కించి గమ్యస్థానాలకు పంపించినట్లు చెప్పారు. అగ్రికల్చర్‌ డైరెక్టర్‌తో ఢిల్లీకి వెళుతున్న మంత్రి కోబ్రాల్‌ అక్కడ ఒక సమావేశంలో పాల్గొంటారు. ఆయనతో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు. ప్రమాదం గురించి సిబ్బందిని విమానాశ్రయ అధికారులు నివేదిక కోరారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/