ఇండిగో సంస్థకు రూ.50 వేలు జరిమానా

సిబ్బంది నిర్లక్ష్యం

IndiGo
IndiGo

ముంబయి: ఇండిగో విమాన సంస్థకు రూ.50 వేలు జరిమానా పడింది. రెండేళ్ల క్రితం అసీమ్, సురభి భరద్వాజ్ అనే ప్రయాణికులు ఇండిగో విమానంలో ఢిల్లీ నుంచి పుణే వెళ్లారు. అయితే వారు తమ సీటు కింద ఓ బొద్దింక ఉన్న విషయాన్ని గుర్తించి విమాన సిబ్బందికి తెలియజేశారు. కానీ, విమాన సిబ్బంది ఆ విషయానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఆ ప్రయాణికులిద్దరూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నా గానీ సిబ్బందిలో చలనంలేదు. పైగా, చేసుకోండి ఫిర్యాదు అంటూ మరింత నిర్లక్ష్యం ప్రదర్శించారు. దాంతో ఆ ప్రయాణికులు బొద్దింకను ఫొటో తీసి ఇండిగో అధికారులకు చూపించగా, వారు సైతం అదేమీ పెద్ద విషయం కాదని తేలిగ్గా తీసిపారేశారు. ఈ నేపథ్యంలో అసీమ్, సురభి కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించగా ఇండిగో సంస్థకు రూ.50 వేలు నష్టపరిహారంతోపాటు వారి టికెట్ చార్జీకి వడ్డీ కలిపి ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. అంతకుముందు కూడా కాస్తంత తతంగం నడించింది. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కన్స్యూమర్ కోర్టు ఇండిగో సంస్థకు నోటీసుల మీద నోటీసులు పంపినా ఇండిగో అధికారులు హాజరుకాలేదు. దాంతో న్యాయమూర్తి ఇండిగో సంస్థకు జరినామా విధించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/