విద్యాభారతి స్కూళ్లలో సంస్కారం నేర్పిస్తారు

పూర్వ విధ్యార్థుల సమ్మేలనంలో: మోహన్‌ భగవత్‌

mohan bhagwat
mohan bhagwat

హైదారబాద్‌: విద్యాభారతి విద్యాసంస్థల్లో సంస్కారం నేర్పిస్తారని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు హైదరాబాద్‌ బండ్లగూడలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ.. మనిషి ఒంటరిగా జీవించలేడని తోడు అవసరమని అన్నారు. జంతువులతో పోల్చుకుంటే మనుషులకు ప్రత్యేక ఆలోచనా విజ్ఞానం ఉంటుందన్నారు. మావనజాతి అభివృద్ధి కోసం పర్యావరణానికి కీడు చేయొద్దు అని సూచించారు. ఇంకా సన్మార్గంలో నడవండి స్వలాభం కోసం కాకుండా దేశ సేవ కోసం పనిచేయండని విద్యార్థులకు పిలుపునిచ్చారు. నాణ్యమైన విద్యతో సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మనిషి ఆలోచనలకు మార్గం చూపించే శిక్షణ కావాలన్నారు. మంచి మనస్సుతో సమర్థవంతంగా చేసే ఏ పనైనా దేశ సేవ కిందకే వస్తుందన్నారు. ఎవరికి ఆసక్తి ఉన్న రంగం వారు ఎంచుకొని ఆ వృత్తిలో రాణించాలని ఆయన కోరారు. స్వార్థం, ఈర్ష వంటి వాటిని వీడి దయ, కరుణను అలవర్చుకోవాలని మోహన్‌ భగవత్‌ చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/