భారత్‌లో 35,043కు చేరిన కరోనా కేసులు

మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,147

coronavirus-India
coronavirus-India

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుంది. గత 24 గంటల్లో భారత్‌లో 73 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,147కి చేరింది. దేశంలో 24 గంటల్లో 1,993 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 35,043కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 8,888 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 25,007 మంది చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసుల సంఖ్య 10,498కి చేరిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 459 మంది మృతి చెందారు. 1,773 మంది కోలుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి https://www.vaartha.com/telangana/