మెక్సికో తర్వాత భారత్‌కు చెందినవారే ఎక్కువ

america
america

అమెరికా: వలసవాదులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న వైఖరితో అక్కడ ఉంటున్న భారతీయులు యూఎస్‌ పౌరసత్వం కోసం క్యూ కడుతున్నారు. 2018లో యూఎస్‌ ఇచ్చిన మొత్తం పౌరసత్వాలలో.. మెక్సికో తర్వాత భారత్‌కు చెందినవారే ఎక్కువమంది ఉన్నారు. 2018లో అమెరికా పౌరసత్వం తీసుకున్న భారతీయులు 52,194 మంది. ఇది 2017తో పోల్చితే 2.7 శాతం ఎక్కువ. ఆ ఏడాది 50,802 మంది పౌరసత్వం తీసుకున్నారు. ఈ మేరకు ది యునైటైడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) 2019 ఏడాదికి సంబంధించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.


2019లో అమెరికా మొత్తంగా 8.34 లక్షల మందికి పౌరసత్వం కల్పించింది. ఇది పదకొండేండ్లలో అత్యధికంగా కాగా, 2018తో పోల్చితే 9.5 శాతం అధికం. 2018లో 7,61,901 మందికి (17.3 శాతం) యూఎస్‌ పౌరసత్వం అందించింది. ఇందులో అమెరికా సరిహద్దు దేశమైన మెక్సికో నుంచి 1,31,977 మంది ఉన్నారు. తర్వాతి స్థానంలో భారత్‌ ఉండగా.. చైనా నుంచి 39,600 మంది సిటిజన్‌షిప్‌ పొందారు. మొత్తంగా పౌరసత్వం పొందినవారిలో భారత్‌ నుంచే 6,9 శాతం (2018లో 7.2 శాతం) మంది ఉన్నారు. వీరందరూ ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేసే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇక గ్రీన్‌కార్డు పొందినవారిలోనూ భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. మెక్సికో, క్యూబా, చైనా తర్వాత 59,281 మంది (మొత్తంగా 5.45 శాతం) భారతీయులు గ్రీన్‌కార్డు పొందారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/