బజరంగ్ పూనియాకు కాంస్యం

టోక్యో : టోక్యో ఒలింపిక్స్ 65 కేజీల ఫ్రీస్టైల్‌లో భ‌జ‌రంగ్ బ్రాంజ్ మెడ‌ల్‌ను కైవ‌సం చేసుకున్నాడు. కాంస్య ప‌త‌కం కోసం సాగిన మ్యాచ్‌లో భ‌జ‌రంగ్ పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించి 8-0 తేడాతో మెడ‌ల్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. బ్రాంజ్ మెడ‌ల్ కోసం జ‌రిగిన మ్యాచ్‌లో క‌జ‌క‌స్తాన్‌కు చెందిన దౌల‌త్ నియాజ్‌బెకోవ్‌తో ఇండియ‌న్ స్టార్ రెజ్ల‌ర్ భ‌జ‌రంగ్ పూనియా పోటీప‌డ్డారు. మ‌రో రెజ్ల‌ర్ ర‌వికుమార్ ద‌హియా 57 కిలోల విభాగంలో ఇండియాకు సిల్వ‌ర్ ప‌త‌కాన్ని అందించిన విష‌యం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/