ఉక్రెయిన్ లో ర‌ష్యా కాల్పులు ..భార‌తీయ విద్యార్థికి గాయాలు

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ లో ర‌ష్యా జరిపిన దాడుల్లో ఓ భార‌తీయ విద్యార్థిపై కాల్పులు జ‌రిగిన‌ట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ తెలిపారు. ర‌ష్యా దాడుల నుంచి త‌ప్పించుకునేందుకు .. ఇండియ‌న్ స్టూడెంట్ పారిపోయే ప్ర‌య‌త్నం చేశాడు. ఆ స‌మ‌యంలో విద్యార్థిపై కాల్పులు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. ఫైరింగ్‌లో ఆ స్టూడెంట్ గాయ‌ప‌డిన‌ట్లు మంత్రి చెప్పారు. ప్ర‌స్తుతం అత‌న్ని మ‌ళ్లీ సిటీలోకి తీసుకువెళ్లార‌ని, అత‌ను హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

విద్యార్థుల త‌ర‌లింపు కోసం పోలాండ్ వెళ్లిన మంత్రి వీకే సింగ్‌.. ఈ విష‌యాన్ని రిజోవ్ విమానాశ్ర‌యంలో మీడియాకు తెలిపారు. ఉక్రెయిన్‌లో ఇంకా 1700 మంది భార‌తీయ విద్యార్థులు చిక్కున్నార‌ని, వారిని త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. కేంద్రం అడ్వైజ‌రీ జారీ చేసిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు 17 వేల మంది భార‌తీయ విద్యార్థులు ఉక్రెయిన్‌ను వ‌దిలి వ‌చ్చారు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధానికి దిగ‌డానికి ముందు సుమారు 20 వేల మందికి పైగా భార‌తీయులు అక్క‌డ వైద్య విద్య‌ను అభ్య‌సిస్తున్న విష‌యం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/