భారత్‌కు చెందిన సుధా నారాయణన్‌కు అమెరికా పౌరసత్వం

దగ్గరుండి ప్రమాణం చేయించిన ట్రంప్

Sudha-Sundari-Narayanan-from-India-sworn-in-as-American-citizen

వాషింగ్టన్‌: భారత్‌కు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ సుధా సుందరి నారాయణన్‌కు అమెరికా పౌరసత్వం లభించింది. ఐదు దేశాలకు చెందిన వారికి అమెరికా పౌరసత్వాన్ని అందించే కార్యక్రమాన్ని ట్రంప్‌ దగ్గరుండి నిర్వహించారు. హోమ్ లాండ్ సెక్యూరిటీ విభాగం కార్యదర్శి చాడ్ వోల్ఫ్ వారితో ప్రమాణం చేయించారు. ఐదుగురు అసాధారణ వ్యక్తులను అమెరికా తన కుటుంబంలోకి నేడు సాదరంగా ఆహ్వానిస్తోందని, వారికి తన శుభాకాంక్షలని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, అమెరికా దేశాన్ని, రంగును, మతాన్ని చూడబోదని చెప్పడానికి ఇంతకన్నా మంచి నిదర్శనం లేదని అన్నారు. అమెరికా ఓ అద్భుత దేశమని కొనియాడారు. వారందరి పేర్లను చదువుతూ వివరాలు వెల్లడించిన ట్రంప్, ఇండియాలో జన్మించి, 13 సంవత్సరాల క్రితం అమెరికాకు వచ్చిన సుధ, ఇప్పటికే తన కెరీర్ లో అద్భుతమైన విజయాలను సాధించారని కొనియాడారు. ఆమెకు ఎంతో టాలెంట్ ఉందని, సుధా దంపతులు అమెరికాకు ఎంతో చేస్తున్నారని, వారిద్దరికీ యాపిల్ పండ్ల వంటి ఇద్దరు పిల్లలున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సుధా నారాయణన్‌ భారతీయ సంప్రదాయాన్ని ప్రతింబింపజేసేలా చీరకట్టులో వచ్చి ట్రంప్ చేతుల మీదుగా పౌర పట్టాను అందుకున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/