రైల్వేలో వచ్చే ఏడాది భారీగా ఉద్యోగాల భర్తీ

Indian Railways
Indian Railways

న్యూఢిల్లీ: రైల్వేలో వచ్చే ఏడాది భారీగా ఉద్యోగాల భర్తీ జరగబోతోంది. 2020 సంవత్సరంలో 3 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ చేయబోతోంది రైల్వే శాఖ. అంతే కాదు… ఇప్పటివరకు రైల్వే రిక్రూట్‌మెంట్
RRB పరీక్షల ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. 2020 జనవరిలోనే ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ విషయాలను రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్‌కు రాతపూర్వకంగా వెల్లడించారు. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్లతో పాటు కొత్త నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 3 లక్షలకు పైగా ఖాళీలు భర్తీ చేయనున్నట్టు రైల్వే మంత్రి పార్లమెంట్‌కు తెలిపారు. మొత్తం 3,00,000 పైగా పోస్టుల్లో 2,621 పోస్టులు గెజిటెడ్ ఆఫీసర్ లెవెల్ కాగా 3,03,606 పోస్టులు నాన్గెజిటెడ్ లెవెల్ స్థాయిలో భర్తీ చేస్తారు. 2018, 2019 సంవత్సరాల్లో నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలు విడుదల కానున్నాయి. ఆ పోస్టులు కూడా ఇందులో కలిపే ఉంటాయి. 2018, 2019 నోటిఫికేషన్లలో ఇప్పటికే 74,507 పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. మిగతా ప్యానెల్స్ ఫలితాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. 36,871 గ్రూప్ సీ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, వచ్చే ఏడాది పూర్తవుతుందని, 1,03,769 లెవెల్ 1 పోస్టులకు 2019 సంవత్సరంలో నోటిఫికేషన్ విడుదల చేశామని, 1.15 కోట్ల దరఖాస్తులు వచ్చాయని పీయూష్ గోయల్ వెల్లడించారు. ఇప్పటికే ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్ష షెడ్యూల్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/