ఆగస్ట్ 12 వరకు అన్నిప్యాసింజర్ రైళ్ల రద్దు

ఆన్ లైన్ టికెట్లకు ఆటోమేటిక్ గా డబ్బు వాపస్

train
train

న్యూఢిల్లీ: దేశలో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో రైల్వేశాఖ ఆగస్టు 12 వరకు రైళ్లను నడుపకూడదని నిర్ణయించింది. మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌, సబర్బన్‌ తదితర అన్ని రెగ్యులర్‌ సర్వీసులను రద్దుచేస్తున్నట్టు రైల్వేబోర్డు గురువారం ప్రకటించింది. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది. అత్యవసర సేవల కోసం ప్రారంభించిన సబర్బన్‌ సర్వీసులు కూడా నడుస్తాయి. తాజా నిర్ణయం నేపథ్యంలో జూలై 1 నుంచి ఆగస్టు 12వరకు జారీ చేసిన టికెట్లను రద్దు చేశారు. టికెట్లు బుక్‌చేసుకున్న వారికి రీఫండ్‌ చేస్తామని రైల్వే బోర్డు పేర్కొంది. మరోవైపు రెగ్యులర్ టైమ్ టేబుల్ రైళ్లలో ప్రయాణించేందుకు 2020 ఏప్రిల్ 14న లేదా అంతకన్నా ముందు బుక్ చేసిన రైలు టికెట్లన్నీ రద్దు చేస్తున్నట్టు రెండు రోజుల క్రితం ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. ఆ ప్రయాణికులకు కూడా ఫుల్ రీఫండ్ ఇస్తామని ప్రకటించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/