80 వేల మంది వలస కూలీలు స్వస్థలాలకు తరలింపు

గమ్యస్థానానికి చేరుకున్న 55 రైళ్లు ..ప్రయాణికుల కోసం రైళ్లలో అన్ని ఏర్పాట్లూ చేశామన్నభారతీయ రైల్వే

Migrant laborers

న్యూఢిల్లీ: దేశంలో కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను, విద్యార్థులను వివిధ పనుల నిమిత్తం వెళ్లివారిని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు తరలిస్తోంది. ఈక్రమంలో దాదాపు 80 వేల మందిని స్వస్థలాలకు చేర్చినట్టు భారతీయ రైల్వే తెలిపింది. ఐదు రోజుల క్రితం తరలింపు ప్రక్రియను ప్రారంభించిన రైల్వే సోమవారం నాటికి 55 రైళ్లు గమ్యస్థానానికి చేరుకున్నట్టు పేర్కొంది. బెంగళూరు, సూరత్, సబర్మతి, జలంధర్, కోటా, ఎర్నాకులం సహా పలు ప్రధాన నగరాల్లోని స్టేషన్‌ల నుంచి నిన్న మరో 30 రైళ్లు వలస కార్మికులతో వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరినట్టు వివరించింది. ఒక్కో రైలులో కనీసం వెయ్యిమంది ప్రయాణికులు ఉన్నట్టు వివరించింది. ఆయా రాష్ట్రాల డిమాండ్ మేరకే శ్రామిక్ రైళ్లను నడుపుతున్నట్టు పేర్కొన్న రైల్వే మరో 500 రైళ్లను నడపనున్నట్టు తెలిపింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/