భారత రాష్ట్రపతి

President Bhavan

భారత ప్రధమ పౌరుడు, రాజ్యాధిపతి, దేశ సార్వభౌమాధికారానికి చిహ్నం రాష్ట్రపతి. భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ వ్యవస్థ ఉంది. దీంతో రాష్ట్రపతికి రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణాది µకారాలన్నీ ఉన్నప్పటికీ ఆచరణలో ప్రధానమంత్రి సలహాపై మాత్రమే నిర్వహించాలి. భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 52 నుంచి 78 వరకు ఉన్న నిబంధనలు కేంద్ర కార్యనిర్వాహక వర్గం గురించి వివరిస్తాయి. ప్రస్తుత రష్ట్ర్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ భారతదేశ 14వరాష్ట్రపతి.

అర్హతలు:
రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతి గా పోటీచేయడానికి ఉండాల్సిన అర్హతలు
1.భారత పౌరుడై ఉండాలి.

 1. 35 సంవత్సరాలు నిండి ఉండాలి.
 2. లోక్‌సభకు ఎన్నిక కావడానికి కావాల్సిన అర్హతలు ఉండాలి.
 3. లాభాదాయక మైన ప్రభుత్వ పదవిలో ఉండకూడదు.

ఈ అర్హ తలతో పాటు కనీసం 50 మంది ఎలక్టోరల్‌ కాలే జీసభ్యులు పోటీచేసేఅభ్యర్థి నామినేషన్‌ పత్రాన్ని ప్రతిపాదించాలి. మరో 50మంది బలపరచాలి. అభ్యర్థి రూ.15వేలు డిపాజిట్‌ చెల్లించాలి.

పదవీ కాలం, తొలగింపు:
రాష్ట్రపతి పదవీకాలం 5సంవత్సరాలు.ఎన్నిసార్లయినా పోటీచేయవచ్చు. రాష్ట్రపతి రాజీనామా చేయదలిస్తే స్వయంగా రాసిన తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి సమర్పించాలి. రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం ద్వారా పార్లమెంటుకు తొలగించగలదు. ఈ తీర్మానాన్ని రాజ్యాంగ ఉల్లంఘన కారణంపై ప్రతిపా దించవచ్చు. 14రోజుల ముందస్తు నోటీస్‌తో పార్లమెంటులోని ఏదైనా ఒక సభ మొత్తం సభ్యుల్లో 1/4వ వంతు ఆమోదంతో ప్రతిపాదించవచ్చు. దానిపై చర్చించిన తర్వాత మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు మెజారిటీతో ఆమోదిస్తే రెండో సభ ఆ తీర్మానంలోని ఆరోపణలపై విచారణ చేయిస్తుంది. రెండో సభ కూడా మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు మెజారిటీతో ఆమోదిస్తే రాష్ట్రపతి పదవి నుంచి వైదొలగాలి.

రాజీనామా, మరణం, తొలగించడం లేదా ఏ కారణంతోనైనా రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఉప రాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగుతారు. ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి కూడా ఖాళీగా ఉంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా ఉంటారు. ఆపదవి ఖాళీగాఉంటే అత్యంత సీనియర్‌ అయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు.రాష్ట్రపతి పదవీకాలం పూర్తి అయి నప్పటికీ, ఎన్నికలు జరిగి ఎన్నికైన వ్యక్తి పదవీ ప్రమాణ స్వీకారం చేసే వరకు కొనసాగుతారు.

ఎన్నిక విధానం:
రాష్ట్రపతి ఎన్నికలను భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఎన్నికల గణం ద్వారా ఎన్నుకుంటారు. ఇందులో పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు (233+543=776 మంది), రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన సభ్యులు (4,120 మంది), (ఢిల్లీ, పుదుచ్చేరితో సహా) ఉంటారు. ఎన్నికల గణం మొత్తం సభ్యుల సంఖ్య 4,896. రాష్ట్ర శాసనసభ్యుల ఓటు విలువ ఆ రాష్ట్ర జనాభా, విధానసభ సభ్యుల సంఖ్యపై ఆధార పడుతుంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌ శాసన సభ్యుడి ఓటు విలువ 208, సిక్కిం శాసన సభ్యు డి ఓటు విలువ 32. పార్లమెంటు సభ్యుల ఓటు విలువ అందరికీ సమానంగా ఉంటుంది. సభ్యు లు తమ ఓటు ప్రాధాన్య క్రమాన్ని పోటీ చేసే అభ్యర్థుల పేరుకు ఎదురుగా సూచించాలి.

ఎన్నిక రహస్య ఓటింగ్‌, నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం లో, ఏక బదిలీ ఓటు పద్ధతిలో జరుగుతుంది. ఎన్నికల్లో గెలవడానికి ీకోటా ఓట్లు పొందాలి.
రాష్ట్రపతి ఎన్నికలపై వచ్చే వివాదాలను విచా రించే అధికారం కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత 30 రోజుల లోపల, ఎన్నికల గణంలోని 20మంది సభ్యులతో కలిసి ఓడిపోయిన అభ్యర్థి లేదా ఎన్నికల గణంలోని సభ్యుడు సుప్రీంకోర్టు లో పిటిషన్‌దాఖలు చేయాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో ీవిప్‌ జారీచేసేఅధికారం రాజకీయపార్టీలకు లేదు.

పదవీ ప్రమాణ స్వీకారం:
భారత రాష్ట్రపతిగా ఎన్నికైన అభ్యర్థితో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.రాష్ట్రపతి తన శక్తిమేరకు రాజ్యాం గాన్ని, చట్టాన్ని పరిరక్షిస్తానని, కాపాడతానని, భారత ప్రజల సేవకు అంకితం అవుతానని ప్రమా ణం చేస్తారు.
రాజ్యాంగం-రాష్ట్రపతి

 • రాజ్యాంగంలోని 52 నుంచి 62 వరకు ఉన్న నిబంధనలు రాష్ట్రపతి గురించి వివరిస్తాయి.

52వ నిబంధన ప్రకారం భారతదేశానికి రాష్ట్రపతి ఉంటారు.

 • 53వ నిబంధన కేంద్ర కార్యనిర్వహణాధికారం గురించి వివరిస్తుంది.
 • 54వ నిబంధన రాష్ట్రపతి ఎన్నిక గురించి తెలియజేస్తుంది.
 • 55వ నిబంధన రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి తెలుపుతుంది.
 • 56వ నిబంధన రాష్ట్రపతి పదవీకాలం గురించి వివరిస్తుంది. – 57వ నిబంధన రాష్ట్రపతి తిరిగి ఎన్నిక కావచ్చని తెలియజేస్తుంది.
 • 58వ నిబంధన రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి కావాల్సిన అర్హతలను తెలుపుతుంది.
 • 59వ నిబంధన రాష్ట్రపతి పదవిలో కొనసాగడానికి అవసరమైన నిబంధనలు, జీతభత్యాలను వివరిస్తుంది.
 • 60వ నిబంధన రాష్ట్రపతి పదవీ ప్రమాన స్వీకారం గురించి తెలుపుతుంది.
 • 61వ నిబంధన రాష్ట్రపతి అభిశంసన విధానాన్ని వివరిస్తుంది.
 • 62వ నిబంధన రాష్ట్రపతి పదవీకాలం ముగియడం లేదా ఇతర కారణాల వల్ల రాష్ట్రపతి పదవీ ఖాళీ అయినప్పుడు అనుసరించాల్సిన పద్ధతిని తెలియజేస్తుంది.

తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/