సింగపూర్‌ లా అకాడమీలో భారత సంతతి వ్యక్తి కీలక పదవి

Indian-Origin Lawyer Rama Tiwari Set To Lead Singapore Academy Of Law

సింగపూర్‌: భారత సంతతికి చెందిన న్యాయవాది రామ తివారీ సింగపూర్‌ లా అకాడమీ (ఎస్‌ఏఎల్‌) అధిపతిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఎస్‌ఏఎల్‌ సీఈఓగా ఉన్న సెరెన్‌ రిటైర్‌ కానుండటంతో ఆయన స్థానంలో రామ తివారీని నియమించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. లండన్లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్యను అభ్యసించిన తివారీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనూ ఎంఎస్సీ చేశారు. 1999లో సింగపూర్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా చేరిన ఆయన ఆ తరువాత ప్రైవేట్ ప్రాక్టీసులో చేరాడు. ఐటీ, మేధో సంపత్తి సమస్యలపై ప్రత్యేక నైపుణ్యం సాధించారు. ఓ బ్యాంకు ఉపాధ్యక్షుడిగా, యూఎస్ టెక్నాలజీ కంపెనీకి గ్లోబల్ సేల్స్ లీడ్‌గానూ ఆయన పని చేశారు. ప్రైవేటు రంగంలో ఆయనకు దాదాపు 20 ఏండ్లకుపైగా అనుభవం ఉంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/