రేపు ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం జలప్రవేశం

ముంబయి : ప్రాజెక్ట్‌-15బీలో భాగంగా నిర్మించిన ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం నౌక ఆదివారం జలప్రవేశం చేయనున్నది. ముంబయి లోని నేవల్‌ డాక్‌యార్డ్‌లో కమీషన్‌ వేడుక జరుగనుండగా.. కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరుకానున్నారు. అలాగే 25న కల్వరి క్లాస్‌ సబ్‌ మెరైన్‌ వెలా నాల్గో సబ్‌మెరైన్‌ జలప్రవేశం చేయనుండగా.. చీఫ్‌ ఆఫ్‌ నేవల్‌ స్టాఫ్‌ అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ పాల్గొనున్నారు.

ఈ సందర్భంగా ఐఎన్‌ఎస్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ కెప్టెన్‌ బీరేంద్ర సింగ్‌ బైన్స్‌ మాట్లాడుతూ.. ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం కమీషనింగ్‌ కోసం సిద్ధంగా ఉన్నామన్నారు. ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం షిప్‌ను డైరెక్టరేట్‌ ఆఫ్‌ నేవల్‌ డిజైన్‌ చేయగా ముంబయి లోని మజాగాన్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిలెడ్‌ నిర్మించింది. ప్రాజెక్టు-15బీలో భాగంగా నిర్మించిన నాలుగు నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన నగరాలైన విశాఖపట్నం, మోర్ముగావ్‌, ఇంఫాల్‌, సూరత్‌ పేర్లు పెట్టారు. వేలా కల్వరి క్లాస్‌ నాల్గో జలాంతర్గామి కాగా.. భారత అమ్ములపొదిలో మరో శక్తివంతమైన ఆయుధంగా నిలువనున్నది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/