ఇండియన్ నేవీ సంచలన నిర్ణయం

సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లపై నిషేధం విధించిన ఇండియన్ నేవీ

Indian Navy
Indian Navy

న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ సంచలన నిర్ణయం తీసుకుంది. నావికాదళ ప్రాంతాల్లో సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హానీ ట్రాప్ ఉచ్చులో పడి నేవీ రహస్యాలను పాకిస్థాన్ కు చేరవేస్తున్న ఏడుగురు నేవీ సిబ్బందిని ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేవీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇండియన్ నేవీలో పని చేస్తున్న సిబ్బందిపై సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్ అమ్మాయిలు వల విసురుతున్నారు. వీరి ద్వారా ఇండియన్ నేవీ రహస్యాలను తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ హవాలా రాకెట్ ఆపరేటర్ తో పాటు ఏడుగురు నేవీ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే, నేవీ ఉద్యోగులపై నావికాదళం ఆంక్షలు విధించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/