ప్రజలతో వేగంగా కనెక్ట్ కావడానికి కొత్త సాధనాలు

న్యూఢిల్లీ: చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్‌) జనరల్ బిపిన్ రావత్ గురువారం జరిగిన ఒక వీడియో సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లడుతూ..ప్రపంచంలోని ఇతర సైన్యాలతో పోల్చుకుంటే భారతదేశం యొక్క సైన్యం ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటున్నదని అన్నారు. దీనిని అధిగమించేందుకు రక్షణ రంగంలో నిర్మాణాత్మక సంస్కరణలు, ఇతర దేశాలు యుద్ధ స్పెక్ట్రంను తీర్చడానికి తీసుకువచ్చిన మార్పులను అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నదని చెప్పారు.

సమాచారం చేరిక, సాంకేతిక అభివృద్ధి కారణంగా 20 వ శతాబ్దం యుద్ధ స్వరూప స్వభావాల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు. ప్రజలతో వేగంగా కనెక్ట్ కావడానికి కొత్త సాధనాలు, వ్యూహాలను ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. ఇది ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదన్నారు. సైన్యంలో వివిధ స్థాయిల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని బిపిన్‌ రావత్‌ అభిప్రాయపడ్డారు. ఇందులో రాజకీయ-సైనిక, వ్యూహాత్మక కార్యకలాపాలు, వ్యూహాత్మక స్థాయిలు ఉంటాయని చెప్పారు.

తాజా తెలంగాణ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/