భారత మార్కెట్లోకి మరో సెడాన్‌

Sedan car
Sedan car

డీల్లీ: దక్షిణ కొరియకు చెందిన దిగ్గజం హ్యూందా§్‌ు భారత మార్కెట్లోకి మరో సెడాన్‌ను తీసుకురానుంది. ఆరా అని దీనికి పేరుపెట్టింది. ఈ విషయాన్ని నేడు ప్రకటించింది. కాకపోతు కారుకు సంబందించిన వివరాలను విడుదలచేయలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న సబ్‌ కాంపాక్ట్‌ సెడాన్‌కు ఎక్సెంట్‌కు దీనిని అప్‌గ్రేడ్‌గా భావిస్తున్నారు. ఈ కారుకు సంబంధించిన పలు నమూనాలను ఇప్పటికే భారత రోడ్లపై పరీక్షించారు. దీనిపై కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ ఆధునికత, సౌకర్యాలు, భద్రత, స్టైల్‌, సాంకేతికతల సమ్మేళనంగా దీనిని తీసుకువస్తున్నామని చెప్పారు. ఎంతదూరమైనా ప్రయాణిస్తామనే విశ్వాసం, సానుకూల దృక్పథం ప్రతిబింబించేలా ఆరా అని పేరు పెట్టినట్లు కంపెనీ తెలిపింది.
తాజా జాతీయ వార్తలకోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/

§్‌ు