నవంబర్‌లో పాకిస్థాన్‌కు మన్మోహన్‌

manmohan singh
manmohan singh


న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నవంబర్‌ మాసంలో పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న దర్బార్‌ సాహిబ్‌ను సందర్శించనున్నారు. సిక్కు మత గురువు గురునానక్‌ 550వ జయంతిని పురస్కరించుకుని మన్మోహన్‌సింగ్‌ దర్బార్‌ సాహిబ్‌ను దర్శించనున్నారు. పంజాబ్‌ సిఎం అమరీందర్‌ సింగ్‌ ఆహ్వానించడంతో వెళ్లేందుకు గురువారం మన్మోహన్‌ సింగ్‌ అంగీకరించినట్లుగా తెలిపారు. నవంబరు 12న గురునానక్‌ జయంతి కావడంతో మన్మోహన్‌ సింగ్‌ నవంబరు 9న కర్తార్‌పూర్‌ గురుద్వారాకు తొలి విడత భక్తులతో కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అక్కడ నుంచి ఆయన సుల్తాన్‌పూర్‌ లోధికి కూడా వెళ్లనున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/