కెటిఆర్‌ను కలిసిన కపిల్‌ దేవ్‌

KTR & Kapil Dev
KTR & Kapil Dev

హైదరాబాద్‌: మాజీ టీమిండియా క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ తెలంగాణ ఐటీశాఖ మంత్రి కెటిఆర్‌తో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా కపిల్‌ దేవ్‌ కెటిఆర్‌ను కలిసి పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కాగా వీరివురి మధ్య ప్రధానంగా డిసెంబర్‌లో హైదరాబాద్‌లో అంతర్జాతీయ గోల్ఫ్‌ టోర్నమెంట్‌ జరగనుంది, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ సహాయ, సహకారాలు అందించాలని కపిల్‌ దేవ్‌ కెటిఆర్‌ను కోరారు. ఈ అంశంపై కెటిఆర్‌ కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news