అరుణాచల్ వద్ద భారత యుద్ధ విమానాలు పెట్రోలింగ్

ఇటానగర్‌ః అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ వద్ద డిసెంబర్ 9వ తేదీన చైనా, భారత సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బోర్డర్ వద్ద యుద్ధ విమానాలతో భారత్ పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. చైనా ఉల్లంఘనలను అడ్డుకునేందుకు గత కొన్ని రోజుల నుంచి భారత వైమానిక దళాలు పెట్రోలింగ్ చేపడుతున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అరుణాచల్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద జోరుగా పెట్రోలింగ్ జరుగుతున్నట్లు తెలిపారు.
డిసెంబర్ 9వ తేదీన తవాంగ్ సెక్టార్ వద్ద చైనా బలగాలు ఎల్ఏసీ దాటి భారత భూభాగంలోకి వచ్చినట్లు సమాచారం. అయితే భారతీయ సైనికులు చైనా ఆర్మీని ధీటుగా ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇవాళ పార్లమెంట్‌లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేయనున్నారు. ఘర్షణ రోజున ఇరు వర్గాల దళాలకు స్వల్ప స్థాయిలో గాయాలైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ ప్రాంతం నుంచి రెండు దేశాలకు చెందిన బలగాలు వెనక్కి వెళ్లాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/