విదేశీయులకు ఉచిత హిందీ పాఠాలు

జనవరి 16 నుంచి భారత ఎంబసీలో క్లాసులు

Hindi classes
Hindi classes

వాషింగ్టన్‌: భారతీయ సంస్కృతి అంటే విదేశీయుల్లో చాలామందికి ఎంతో మక్కువ.మన కుటుంబ వ్యవస్థ, వైవాహిక జీవితం, యోగా, సనాతన ధర్మం, బాలీవుడ్ వంటి అంశాలపై విదేశీయులు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. భారతీయులతో మమేకం కావాలంటే భాష ఎంతో ముఖ్యమని భావించి హిందీ నేర్చుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ విషయాన్ని గమనించిన అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేకంగా హిందీ తరగతులు నిర్వహిస్తోంది. భారత ఎంబసీలో సాంస్కృతిక విభాగం ప్రతినిధి మోక్షరాజ్ ప్రత్యేకంగా హిందీ బోధించనున్నారు. జనవరి 16 నుంచి వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయంలో క్లాసులు ప్రారంభం కానున్నాయి. హిందీ బోధనకు అమెరికన్లు, ఇతర విదేశీయులు ఎలాంటి రుసుము చెల్లించనవసరంలేదు. ఇది పూర్తిగా ఉచితం.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/