జవాన్ల మృతిపై క్రికెటర్ల సానుభూతి

pulwama attack
pulwama attack

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లో గురువారం సీఆర్పీఎఫ్‌ జవాన్లు వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు ఐఈడితో ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 49 మంది జవాన్లు అమరులయ్యారు. గత మూడేళ్లలో ఇదే పెద్ద ఆత్మాహుతి దాడి. ఈ ఘటన యావత్‌ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదులు దాడికి తెగబడటం తీవ్ర విచారం కలిగిస్తుందని భారత క్రికెటర్లు పేర్కోన్నారు. టీమిండియా బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియ జేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.