అధిక తిరస్కరణలు ట్రంప్‌ సర్కార్‌లోనే

భారత ఐటీలపై తీవ్ర ప్రభావం

H1-B Visa Denials
H1-B Visa Denials

వాషింగ్టన్‌: నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ చేపట్టిన ఓ అధ్యయనంలో ట్రంప్‌ హయాంలో అమెరికాలో వీసా తిరస్కరణలు ఎక్కువగా జరిగినట్లుగా గుర్తించింది. అమెరికాలో వలసలను తగ్గించి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకుగాను ట్రంప్‌ సర్కార్‌ వీసా నిబంధనలలో మార్పులు చేసిన విషయం విదితమే. కాగా ఈ నిర్ణయం వలన హెచ్‌-1బి వీసాలు అధికంగా తిరస్కరణకు గురైనట్లుగా, అందులో అధికంగా భారతదేశానికి చెందిన ఐటీ కంపెనీల నుంచి వచ్చినవేనని ఓ నివేదికలో పేర్కొంది. విప్రో చేసిన వాటిల్లో తిరస్కరణలు అత్యధికంగా 53 శాతానికి పెరిగినట్లుగా, తరువాతి స్థానంలో ఇన్ఫోసిస్‌ 45 శాతానికి పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ 34 శాతం, టెక్‌ మహింద్ర 41శాతానికి పరిమితమయ్యాయి. కాగా ఈ తిరస్కరణలు 2015 వరకు 8శాతానికి మించి దాటలేదని, ట్రంప్‌ సర్కార్‌లో మాత్రమే ఇవి పెరిగాయని, వలస విధానాల్లోని కఠిన నిబంధనలు, పాలసీల్లోని మార్పుల కారణంగా ట్రంప్‌ ప్రభుత్వం తన లక్ష్యాన్ని చేరిందని నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ అభిప్రాయపడింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/