టోక్యో ఒలింపిక్స్ నుండి మేరీ కోమ్ నిష్క్రమణ

ప్రీక్వార్టర్స్ లో పరాజయం
3-2తో నెగ్గిన కొలంబియా బాక్సర్

టోక్యో: భారత స్టార్ బాక్స‌ర్, ఆరుసార్లు వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌ మేరీ కోమ్ ఒలింపిక్స్ ఫైట్ ముగిసింది. కొలంబియాకు చెందిన ఇన్‌గ్రిట్ విక్టోరియా చేతిలో 2-3 తేడాతో మేరీ కోమ్ ఓడిపోయింది. తొలి రౌండ్‌లోనే విక్టోరియా ఎదురుదాడికి దిగ‌డంతో మేరీ కోమ్‌కు కోలుకునే అవ‌కాశం ద‌క్క‌లేదు. తొలి రౌండ్‌లో న‌లుగురు జ‌డ్జీలు విక్టోరియాకు 10 స్కోరు ఇచ్చారు. అయితే రెండో రౌండ్‌లో మేరీ పుంజుకొని ప్ర‌త్య‌ర్థిపై పైచేయి సాధించింది. కీల‌క‌మైన మూడో రౌండ్‌లో మ‌రోసారి విక్టోరియా ఎదురుదాడికి దిగడంతో మేరీ కోమ్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/