శాంతి స్థాపన కోసం పాక్ పనిచేయాలి

గ్రే లిస్టులో ఉండడం ఏ దేశానికైనా పెద్ద దెబ్బే

Bipin Rawat
Bipin Rawat

న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తున్న పాకిస్థాన్ పై ప్రస్తుతం ఒత్తిడి ఉందని భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ అన్నారు. పాకిస్థాన్ ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏ‌టీఎఫ్) గ్రే లిస్ట్‌ లో ఉంచిన విషయం తెలిసిందే. ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణను సమర్థవంతంగా నిర్వహించే వరకు ఆ దేశం గ్రే లిస్ట్‌లో ఉంటుందని ఇటీవల ఫ్రాన్స్ లో ఎఫ్ఏటీఎఫ్ మరోసారి స్పష్టం చేసిన విషయంపై రావత్ స్పందించారు. ‘పాక్ పై ఒత్తిడి ఉంది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఆ దేశం చర్యలు తీసుకోవాల్సి ఉంది. శాంతి స్థాపన కోసం పాక్ పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. గ్రే లిస్టులో ఉండడం ఏ దేశానికైనా పెద్ద దెబ్బే’ అని రావత్ అన్నారు. కాగా, ఇటీవల ప్యారిస్ లో ఎఫ్ఏ‌టీఎఫ్ ప్లీనరీ సమావేశాలు నిర్వహించింది. అందులో ఏ దేశమూ పాక్ కు మద్దతు తెలపలేదు. అయితే, బ్లాక్‌లిస్ట్ నుంచి మాత్రం పాక్ తప్పించుకుంది. 2020 ఫిబ్రవరి నాటికి పాక్ ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణ పూర్తిగా అమలు చేయాలని ఎఫ్ఏ‌టీఎఫ్ ఆదేశించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/