భారత్‌కు అమెరికా పూర్తి మద్దతివ్వాలి

Trump
Trump

అమెరికా: జమ్మూకశ్మీర్‌ విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయానికి పూర్తి మద్దతు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వాన్ని భారతీయ అమెరికన్లు కోరారు. భారత అంతర్గత సార్వభౌమ నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని. అలాగే ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానుకోవాల్సిందిగా పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచాలని తాము అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నామని హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సమీర్‌ కల్రా తెలిపారు. దేశ 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతికి మోదీ ప్రభుత్వం అత్యుత్తమ బహుమతి ఇచ్చిందని బీజేపీ విదేశీ స్నేహితుల సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి అన్నారు. దీనివల్ల జమ్మూ కశ్మీర్‌లో శాంతిభద్రతలు మరింత పెరుగుపడాలని, భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సంబంధాలు బాగుండాలని న్యూయార్క్‌కు చెందిన న్యాయవాది రవి బాత్రా అభిప్రాయపడ్డారు.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/