ప్రతి విభాగంలోనూ భారత సంతతి వ్యక్తులు..బైడెన్

భార‌తీయుల‌ను మెచ్చుకున్న బైడెన్‌

వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతి పౌరుల ప్రాతినిధ్యం రోజురోజుకూ పెరుగుతోందని అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పాలనలో ఇండియన్ అమెరికన్స్ కు స్థానం లభించిందని గుర్తు చేసిన ఆయన, ప్రభుత్వంలోని ప్రతి విభాగంలో భారత సంతతి మూలాలున్న వారు ఉన్నారని చెప్పారు. తాజాగా, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహించిన సమావేశాన్ని ఉద్దేశించి వర్చ్యువల్ విధానంలో బైడెన్ ప్రసంగించారు.

బైడెన్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి 50 రోజులు గడుస్తుండగా, పలు కీలక పోస్టుల్లో 55 మంది భారత సంతతి అమెరికన్లు నియమితులైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావించిన బైడెన్ “ఇండియా నుంచి వచ్చిన వారి సంతతి దేశంలో విస్తరిస్తోంది. మీరు (స్వాతి మోహన్), నా ఉపాధ్యక్షురాలు (కమలా హారిస్), నా ప్రసంగాన్ని రాసింది (వినయ్ రెడ్డి)… అందరూ ఇండియన్ మూలాలున్నవారే. మార్స్ పై రోవర్ సురక్షితంగా ల్యాండ్ కావడం వెనుకా వారున్నారు” అని వ్యాఖ్యానించారు.

తాజా బిజినెస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/