భారతసంతతి మహిళకు అరుదైన అవకాశం

manga anantatmula
manga anantatmula

అమెరికా:అమెరికాలో జరిగే కాంగ్రెస్‌ డిస్ట్రిక్ట్‌ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంగా అనంతాత్ముల పోటీ చేస్తోంది. సంపన్నుల ప్రాంతంలో ఆమె ఈ పోటికి దిగారు. అమెరికాలో తెలుగింటి ఆడపడుచు అరుదైన అవకాశం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంగా అనంతాత్ముల అమెరికా ప్రతినిధుల సభకు పోటీ చేస్తుండటం విశేషం. వర్జీనియాలోని 11వ కాంగ్రెస్‌ జిల్లాలో రిపబ్లికన్‌ పార్టీ తరపున ఆమె అభ్యర్థిత్వం ఖరారైంది. దీనితో ఆమె రెండు రోజులగా ప్రచారం కూడా షూరు చేసారు. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన మంగ పాఠశాల విద్యాభ్యాసం చెన్నైలో సాగింది. ఆగ్రా వర్సిటీలో డిగ్రీ చేసారు. 1990లో భర్త కుమారుడితో కలిసి అమెరికాకు వలస వచ్చారు. రక్షణ కొనుగోళ్ల విభాగంలో ఫెడరల్‌ ప్రభుత్వ కాంట్రాక్టరుగా ఆమె వ్యవహరించారు.


డెమోక్రాట్లకు కంచుకోటగా ఉన్న ఈ వర్జినియా స్థానం నుంచి ప్రతినిధుల సభకు పోటీచేస్తున్న తొలి భారత సంతతి మహిళగా మంగా నిలిచారు. ఈమె పోటీచేసే ప్రాంతంలో సంపన్నులు అధికంగా ఉన్నారు. 17 శాతం ఆసియా జనాభా ఉండగా ఏడు శాతం ప్రవాస భారతీయులే ఉన్నారు. సాధారణంగా ఆసియన్ల మద్దతు డెమొక్రటిక్‌ పార్టీకే అయినప్పటికీ ఈ సారి మార్పురావచ్చనే ఆశాభావంతో ఆమె ఉన్నారు. ఆరుసార్లు కాంగ్రెస్‌ సభ్యుడిగా గెలిచిన జెర్రీ కొన్నాల్లీతో నవంబరులో జరగనున్న ఎన్నికల్లో ఆమె తలపడుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/