జెఫ్‌ బెజోస్‌కు చేదు అనుభవం

jeff bezos
jeff bezos

లాస్‌వెగాస్‌: ప్రముఖ ఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజం అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆ సంస్థ రీ మార్స్‌ పేరిట నిర్వహిస్తున్న సదస్సులో బెజోస్‌ ప్రసంగం చేస్తుండగా భారత సంతతికి చెందిన మహిళ ఆయన ప్రసంగాన్ని అడ్డుకుంది. ప్రియా సాహ్ని అనే ఓ జంతు ప్రేమికురాలు డైరెక్ట్‌ యాక్షన్‌ ఎవ్రీవేర్‌ అనే జంతు సంరక్షణ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. ఆమె ఈ సదస్సుకు హాజరై బెజోస్‌ ప్రసంగిస్తూఉండగా మధ్యలో ఒక్కసారిగా జంతువుల పట్ల జరుగుతున్న అక్రమాలను అరికట్టాలి అని గట్టిగా అరుస్తూ వేదిక పైకి దూసుకెళ్లారు. మీరు ప్రపంచంలో అత్యంత ధనవంతులు, మీరు తలచుకుంటే జంతువుల్పి కాపాడగలరు. ఎలాగైనా జంతువుల పట్ల జరుగుతున్నఅక్రమాలను ఆపండి అని సమావేశంలో సాహ్ని గట్టిగా అరిచింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది వేదికపై నుంచి సాహ్నిని బయటకు తీసుకెళ్లారు. ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కోవడం బెజోస్‌కు రెండోసారి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/