శత్రుభీకర అస్త్రాలను ప్రదర్శించిన భారత్
గగరతలంలోనూ భారత వాయుసేన మిరుమిట్లు గొలిపే ప్రదర్శన

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరైన ఈ వేడుకల్లో ప్రధానంగా భారత ఆయుధ సంపత్తి అందరి దృష్టిని ఆకర్షించింది. అనేక శత్రుభీకర అస్త్రాలను భారత్ ఈ వేడుకల్లో ప్రదర్శించింది. దేశీయంగా తయారైన ధనుష్ ఫీల్డ్ గన్స్ అతిథులను ఆకట్టుకున్నాయి. ప్రపంచంలో అత్యంత కచ్చితంగా లక్ష్యాలను ఛేదిస్తాయని ధనుష్ శతఘ్నులకు పేరుంది. గగనతలంలోనూ భారత వాయుసేన తన అస్త్రాలను ప్రదర్శించింది. ఎంతో శక్తిమంతమైన చినూక్ హెలికాప్టర్లు దద్దరిల్లిపోయే శబ్దంతో పయనించాయి. రెండు రోటార్లు ఉండే ఈ హెలికాప్టర్ భారీగా సైనికులను, వాహనాలను, ఇతర ఆయుధాలను తరలించాల్సి వచ్చినప్పుడు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న అపాచీ హెలికాప్టర్లు కూడా ప్రధానాకర్షణగా నిలిచాయి.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/