ప్రపంచకప్‌కు కోహ్లిసేన జట్టు ప్రకటన

team india
team india


ముంబై: మే 30న జరగనున్న ప్రపంచకప్‌కు ఆడే సభ్యులను బిసిసిఐ ఎట్టకేలకు ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని భారత సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ముంబైలో సమావేశమైంది. ఈ సమావేశానికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి హాజరయ్యాడు. ప్రపంచకప్‌లో 15 మందితో కూడిన టీమిండియా జట్టును మీడియా ముందు ప్రకటించారు. రిషబ్‌ పంత్‌కు, అంబటి రాయుడుకి చోటు దక్కలేదు.
కోహ్లిసేన:
విరాట్‌ కోహ్లి(సారథి), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), ధోని, శిఖర్‌ ధావన్‌, కేదార్‌ జాదవ్‌, విజ§్‌ు శంకర్‌, కేఎల్‌ రాహుల్‌, దినేశ్‌ కార్తీక్‌, చాహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రా, హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ.
బ్యాట్స్‌మెన్‌: కోహ్లి, రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌
బౌలర్లు: బుమ్రా, షమీ, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌, చాహల్‌
వికెట్‌ కీపర్లు: ధోని ,దినేశ్‌ కార్తీక్‌

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/