మసూద్ విషయంలో సహనంతో భారత్

మసూద్‌ను ఐరాస తప్పకుండా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తుంది
న్యూఢిల్లీ: జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అంశంపై భారత్ సహనాన్ని ప్రదర్శిస్తుందని అధికారిక వర్గాలు శనివారం నాడు వెల్లడించాయి. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో మసూద్ పేరును ఐరాస చేర్చడం తథ్యం అని సదరు వర్గాలు విశ్వాసం వ్యక్తం చేశాయి.
పుల్వామా దాడి నిందితుడు మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు ఫిబ్రవరి 27న ఐరాస భద్రతా మండలిలో ప్రతిపాదన తీసుకొచ్చాయి. ఈ ప్రతిపాదనకు చైనా చివరి నిమిషంలో అడ్డుతగిలింది. ఈ విషయంలో భారత్‌కు 14 దేశాల మద్దతు లభించింది. హోల్డ్‌లో పెట్టడం అంటే ప్రతిపాదనను అడ్డుకోవడం కాదు, కొన్ని రోజులు మౌనంగా ఉండడం. ఈ విషయంలో భారత్ సహనాన్ని ప్రదర్శిస్తుంది. ఉగ్రవాదం పెను సవాల్ అని, పాక్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు జరుగుతున్నాయని చైనాకు కూడా తెలుసు. మసూద్‌ను ఐరాస తప్పకుండా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తుందని ప్రగాఢ విశ్వసంతో ఉన్నామని అధికారిక వర్గాలు తెలిపాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/