కోహ్లి కెప్టెన్సీపై గంగూలీ కామెంట్స్‌

ganguly and kohli
ganguly and kohli

న్యూఢిల్లీ: సౌరబ్‌ గంగూలీ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. బిసిసిఐ అధ్యక్షుడిగా నియామకం ఖాయమైన దిగ్గజ మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. కోహ్లి కెప్టెన్సీలో మన జట్టు మంచి ప్రదర్శనలు చేస్తోందని కొనియాడాడు. అయితే, కీలకమైన ఐసిసి టోర్నమెంట్లలో చివరి దశలో ఓటమి చవిచూస్తునారని, దీనిని అధిగమించడంపై దృష్టి పెట్టాలని సూచించాడు. ప్రపంచకప్‌లో ఓడిపోవడంపై కూడా గంగూలీ కామెంట్లు చేశాడు. ఆటగాళ్లంతా అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ సెమీఫైనల్‌, ఫైనల్స్‌లో బోల్తా పడుతున్నారు. విరాట్‌ సారధ్యంలో మన జట్టు మరింత మెరుగ్గా రాణించి, విజయాలను సొంతం చేసుకోవాలని సూచించారు. 2013లో ధోని సారధ్యంలో ఐసిసి చాంపియన్స్‌ ట్రోఫి గెలిచిన టీమిండియా ఆ తర్వాత ఐసిసి టోర్నీలో విజేగా నిలవలేదు. కోహ్లి సారధ్యంలో టీమిండియా ఇంటాబయటా మెరుగైన ఆటతో దూసుకెళ్తోంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/sports/