విండీస్ పై భారత్ ఘన విజయం

విండీస్ పై భారత్ ఘన విజయం
India west indies oneday

కటక్ లో భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టుపై భారత్ జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 315 పరుగులు చేసింది. భారత్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడంతో వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ చేపట్టింది. వెస్టిండీస్ బ్యాట్స్ మెన్లు  పూరన్ 89,  పోలార్డ్  74, హోప్ 42, ఛేజ్ 38, హెట్మెయిర్  37, లూయిస్ 21 పరుగులు చేశారు. భారత్ బౌలర్లు నవదీప్ షైనీ రెండు, షమీ, శార్దూల్, రవీంద్ర జడేజాలు ఒక్కొక్కటి చొప్పున వికెట్లు తీశారు. భారత్ జట్టు 48.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టపోయి 316 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ 85, లొకేష్ రాహుల్ 77, రోహిత్ శర్మ 63, రవీంద్ర జడేజా 39 పరుగులు చేశారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/