మాల్దీవులకు అండగా నిలుస్తాం: ప్రధాని మోడి

ఆ దేశ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని

Ibrahim Mohamed Solih- pm modi
Ibrahim Mohamed Solih- pm modi

న్యూఢిల్లీ: కరోనా మహ్మమారి ప్రపంచదేశాలను వణికిస్తుంది. ఈనేపథ్యంలోనే భారత ప్రధాని మోడి ఈ రోజు మాల్దీవులు అధ్యక్షుడు ఇబ్రహీం మొహమద్ సొలీతో ఫోన్లో మాట్లాడారు. మాల్దీవుల్లో కరోనా మహమ్మారి ప్రభావం, దాని కారణంగా దేశం ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక సమస్యల గురించి చర్చించారు. ఈ కష్టకాలంలో తమ పొరుగు దేశానికి భారత్ సహకారం అందిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. భారత్, మాల్దీవులు మధ్య ప్రత్యేక బంధం ఉందని మోడి అన్నారు. అది తమ ఉమ్మడి శత్రువు అయిన కరోనాపై కలిసి పోరాడాలనే ఇరు దేశాల సంకల్పానికి బలం చేకూరుస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు మోడి వరుస ట్వీట్స్ చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/