బౌలింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌

West Indies won the toss
West Indies won the toss

విశాఖ: నేడు భారత్‌-వెస్టిండీస్‌ మధ్య నిర్ణయాత్మక పోరుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. టాస్‌ గెలిచి విండీస్‌ బౌలింగ్‌ను ఎంచుకుంది. విశాఖ వేదికగా రెండో వన్డే మరికాసేపట్లో ప్రారంభం కానుంది. పోలార్డ్‌ మాట్లాడుతూ.. విశాఖ పిచ్‌ చేజింగ్‌కు సహకరిస్తుందని ఫీల్డింగ్‌ను ఎంచుకున్నామని తెలిపాడు. ఈ పోరులో గెలిస్తే మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉండగానే సిరీస్‌ దక్కించుకోవాలని విండీస్‌ యోచిస్తుంది. కాగా మరోవైపు ఈ మ్యాచ్‌ను దక్కించుకుని సిరీస్‌పై ఆశలు నిలబెట్టుకోవాలని భారత్‌ పట్టుదలతో బరిలో దిగనుంది. విశాఖ స్టేడియం భారత్‌కు విజయాన్ని ఇవ్వనుందార? లేక పరాజయాన్ని ఇవ్వనుందా వేచి చూడాలి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/