మహిళా టీ20 మ్యాచ్‌ రద్దు

South Africa Women vs India Women
South Africa Women vs India Women

సూరత్: భారత్‌సౌతాఫ్రికా మహిళా జట్ల మధ్య గురువారం జరగాల్సిన రెండో ట్వంటీ20 మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దయ్యింది. సూరత్‌లో జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం బారీన పడింది. కనీసం టాస్ కూడా వేసే వీలు లేకుండా పోయింది. మైదానం మొత్తం చిత్తడిగా మారడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రాత్రి నుంచే నగరంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో మైదానం పూర్తిగా వర్షంతో నిండిపోయింది. ఆటకు పరిస్థితులు అనుకూలంగా లేక పోవడంతో మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు. చాలా సార్లు స్టేడియాన్ని పరిశీలించిన అంపైర్లు చివరికి మ్యాచ్‌ను రద్దు చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయ్యింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య భారత జట్టు విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌లో 10 ఆధిక్యంలో నిలిచింది. కాగా, రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావించిన సౌతాఫ్రికాకు నిరాశే మిగిలింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/