తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

Rohit-Sharma
Rohit-Sharma

విశాఖ: విశాఖలో జరుగుతున్న టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్లు దూకుడు ప్రదర్శించారు. తొలి రోజు రోహిత్ శర్మ సెంచరీతో అదరగొడితే రెండో రోజు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా సెంచరీతో సత్తా చాటాడు. అయితే.. 176 పరుగులు చేసి డబుల్ సెంచరీ దిశగా దూసుకెళుతున్న రోహిత్ శర్మను కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో డీ కాక్ స్టంప్ ఔట్ చేశాడు. దీంతో రోహిత్ డబుల్ సెంచరీ మిస్ అయిందని అభిమానులు నిరాశ చెందారు. ఓపెనర్లు ఇద్దరూ 317 పరుగుల పటిష్ట భాగస్వామ్యాన్ని అందించారు. రోహిత్ ఔట్ అయిన అనంతరం పుజారా క్రీజులోకొచ్చాడు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/