ఐటిఏను ప్రశ్నించిన రోహన్‌ బోపన్న

స్పందించిన మహేష్‌ భూపతి

Rohan Bopanna
Rohan Bopanna
Mahesh Bhupathi
Mahesh Bhupathi

హైదరాబాద్‌: డేవిస్‌ కప్‌ పోరుకు కెప్టెన్‌ మార్పుపై సీనియర్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న భారత టెన్నిస్‌ సమాఖ్య(ఐటిఏ) తీరుపై మండిపడ్డారు. ఆటగాళ్లను సంప్రదించకుండా మహేష్‌ భూపతి స్థానంలో నాన్‌-ప్లేయింగ్‌ కెప్టెన్‌గా రోహిత్‌ రాజ్‌పాల్‌ను ఎలా ఎంపిక చేస్తారని ఐటిఏను ప్రశ్నించారు. కాగా భారత్‌-పాక్‌ జట్ల మధ్య జరిగే డేవిస్‌ కప్‌ పోరును తటస్థ వేదికకు మారుస్తున్నట్లు అంతర్జాతీయ టెన్నిస్‌ సంఘం(ఐటిఎఫ్‌) అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై మహేష్‌ భూపతి స్పందించి నేను పాకిస్థాన్‌ వెళ్లేందుకు సిద్ధంగా లేనని, పాక్‌ పోరుకు తన స్థానంలో నాన్‌-ప్లేయింగ్‌ కెప్టెన్‌గా రోహిత్‌ రాజ్‌పాల్‌ వ్యవహరిస్తారని తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/