11 వేల పరుగుల రికార్డుకు చేరువలో కోహ్లి!


న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో చేరుకునే అవకాశం?

virat kohli
virat kohli

ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటికే అత్యంత వేగంగా పదివేల పరుగుల మైలురాయిని చేరుకున్న టీమిండియా సారథి కోహ్లి న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో మరో 57 పరుగులు చేస్తే 11 వేల మార్కును చేరుకుంటాడు. ఇప్పటివరకు 221 ఇన్నింగ్స్‌లో 10,943 పరుగులు పూర్తి చేసిన అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగిడి 11 ఏళ్లు కూడా పూర్తి కాకముందే ఈ మైలురాయిని చేరుకుని రికార్డు సృష్టించనున్నాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 11 వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లో కోహ్లి 9వ స్థానంలో నిలవగా భారత్‌ తరఫున మూడో ఆటగాడిగా కొనసాగుతాడు. అతని కన్నా ముందు సయిన్‌, గంగూలీ ఈ మైలురాయిని చేరుకున్నారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/