రెండో రోజు ముగిసిన ఆట : న్యూజిలాండ్‌ 216/5

Wellington test

వెల్లింగ్టన్‌లో భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలిటెస్ట్‌ రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 71.1 ఓవర్లకు గానూ 5 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ బ్యాట్స్‌ మెన్లు కానె విలియమ్సన్‌ 89 పరుగులు, రాజ్‌ టేలర్‌ 44, బ్లండెల్‌ 30, హెన్రీ నికోలస 17 పరుగులు చేయగా, వాట్లింగ్‌ 14 పరుగులు, గ్రాండ్‌ హోమ్‌ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ జట్టు 51 పరుగుల ఆధిక్యతతో ఉంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/