టీ20లో కేఎల్‌ రాహుల్‌ అరుదైన రికార్డు

K. L. Rahul
K. L. Rahul

న్యూజిలాండ్‌: వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో కేఎల్ రాహుల్ నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సు ద్వారా కేఎల్ రాహుల్ ఈ మైలురాయిని అందుకోవడం విశేషం.టీ20ల్లో నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకునే క్రమంలో కేఎల్ రాహుల్ యావరేజి 42.10గా నమోదు కాగా… స్ట్రయిక్ రేట్ 140కిపైగా ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోని, సురేష్ రైనా, శిఖర్ ధావన్‌ల తర్వాత టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో ఉన్నాడు.కేఎల్ రాహుల్ తన చివరి ఐదు ఇన్నింగ్స్‌ల్లో చేసిన స్కోర్లు 45, 54, 56, 57నాటౌట్, 39. ఈ ఫార్మాట్‌లో కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/