మూడో రోజు భారత్‌ స్కోరు 144/4

IND vs NZ Test match
IND vs NZ Test match

వెల్లింగ్టన్: భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 65 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. దీంతో భారత్ జట్టు న్యూజిలాండ్ జట్టు కంటే 39 పరుగులు వెనుకబడి ఉంది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ బ్యాట్స్ మెన్లు మయాంక్ అగర్వాల్ 58, కోహ్లీ 19, ఫృథ్వీషా 14, ఛటేశ్వర్ పుజారా 11 పరుగులు చేసి ఔట్ కాగా, అజింక్య రహానే 25, హనుమ విహారి 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లు ట్రెన్ట్ బౌల్డ్ మూడు, టిమ్ సౌథీ ఒక వికెట్ తీశారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/