నేడు భారత్‌-ఆస్ట్రేలియా తొలి వన్డే

Team india
Team india

ముంబయి: ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియాతో ఏ జట్టు ఆడినా ఓడిపోవడం ఖాయమే అనే అభిప్రాయం అభిమానుల్లో ఉంటుంది. ఐతే… ఆస్ట్రేలియాతో ఆడితే గెలుపు ఎవరిది అన్నది మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఈమధ్య కాలంలో టీమిండియా వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక లాంటి జట్లను ఈజీగా ఓడించేసి… వరుస సిరీస్‌లు కొట్టేసింది. అందువల్ల టీమిండియాలో కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. ఐతే… ఓడిపోయిన జట్ల సంగతి ఎలా ఉన్నా… ఇవాళ తలపడుతున్న ఆస్ట్రేలియా మామూలు జట్టుకాదు. దానికి బ్యాటింగ్, బౌలింగ్ రెండూ పవర్‌ఫుల్‌గానే ఉన్నాయి. అంతేకాదు… టీమిండియాకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ ఇతరత్రా ఉన్నట్లే… ఆసీస్‌కి స్మిత్, వార్నర్ వంటి వాళ్లున్నారు. ఏ జట్టునూ తక్కువ అంచనా వేసేలా లేవు. అయినప్పటికీ… ఇదివరకట్లా ఆస్ట్రేలియాకి దొరికిపోయే ఛాన్స్ ఉండదనీ, మేమేంటో చూపిస్తామని విరాట్ కోహ్లీ చెబుతున్నాడు. దానికి తోడు పిచ్… ఎక్కువ పరుగులు ఇచ్చే రకం. అందువల్ల రెండు జట్లూ దుమ్మురేపే ఛాన్సుంది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే ఇవాళ… ముంబై లోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 1.30కి ప్రారంభం కానుంది. ఆ సమయంలో… ఏ సినిమాకో వెళ్లకపోయి ఉంటే… ఈ మ్యాచ్‌ చూసి ఎంజాయ్ చెయ్యొచ్చంటున్నారు అభిమానులు. 2018లో భారత పర్యటనకు వచ్చిన కంగారూలు… 32తో సిరీస్ గెలుచుకొని… టీమిండియాకు షాక్ ఇచ్చింది. ఈసారి ప్రతీకారం తీర్చుకుంటామని విరాట్ కోహ్లీ చెబుతున్నాడు. ఇప్పటి వరకూ ఈ రెండు దేశాలూ… 57 వన్డే సిరీస్‌లు ఆడాయి. భారత్‌ 14, ఆస్ట్రేలియా 26 గెలిచాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/