మరో రికార్డు కోసం కోహ్లి ఎదురుచూపు!

Virat Kohli
Virat Kohli


సౌతాంప్టన్‌: భారత సారథి విరాట్‌ కోహ్లి మరో అరుదైన రికార్డు కోసం ఎదురుచూస్తున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 11 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సచిన్‌ రికార్డును ఈ టోర్నీలోనే తన పేరిట రాసుకున్న విరాట్‌, ఇప్పుడు అన్ని ఫార్మాట్‌లలో కలిపి వేగంగా 20 వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్‌మెన్‌గా నిలిచేందుకు 104 పరుగుల దూరంలో ఉన్నాడు. సచిన్‌, లారా 453 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, కోహ్లి ఇప్పటివరకు 415 ఇన్నింగ్స్‌ల్లో 19,896 పరుగులు చేశాడు. ప్రస్తుతం కోహ్లి ఖాతాలో 19, 896 పరుగులుండగా, మరో 104 పరుగులు చేస్తే ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో 20 వేల పరుగులు సాధించిన దిగ్గజాలు సచిన్‌ ,లారాలను కోహ్లి అధిగమించనున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విరాట్‌ దిగ్గజాల రికార్డును బ్రేక్‌ చేస్తాడో లేదో చూడాలి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/