2022లో జి-20 స‌ద‌స్సుకు భార‌త్ ఆతిథ్యం

ram nath kovindh
ram nath kovindh, president

న్యూఢిల్లీః  ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌త్‌కు ప్ర‌త్యేక గుర్తింపు వ‌చ్చింద‌ని రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. విదేశాల‌తో మ‌న సంబంధాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయ‌న్నారు. ఈ నేప‌థ్యంలోనే 2022లో భార‌త్ జీ20 స‌ద‌స్సును నిర్వ‌హించ‌నున్న‌ట్లు రామ్‌నాథ్ చెప్పారు. ఇవాళ పార్ల‌మెంట్‌లో ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు. ఉగ్ర‌వాదం అంశంలో ప్ర‌పంచ దేశాలు అన్నీ భార‌త్‌కు అండ‌గా ఉన్నాయ‌న్నారు. పాక్‌లో ఉన్న మ‌సూద్ అజ‌ర్‌ను ఐక్యరాజ్య‌స‌మితి అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా గుర్తించింద‌న్నారు. విదేశాల్లో సెటిల్ అయిన భార‌తీయుల ర‌క్ష‌ణ కోసం ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. విదేశాల్లో ఇబ్బందిప‌డుతున్న వారిని శ‌ర‌వేగంగా ఆదుకుంటున్నార‌న్నారు. పాస్‌పోర్ట్‌, వీసా స‌ర్వీసుల‌ను వేగ‌వంతం చేశామ‌న్నారు. అక్ర‌మంగా భార‌త్‌లోకి చొర‌బ‌డుతున్న విదేశీయులతో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌ ముప్పుగా మారింద‌న్నారు.

తాజా హీరోల ఫోటోగ్యాల‌రీల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/photo-gallery/actors/